: దక్షిణాఫ్రికాను ముంచనున్న వాన


బంగ్లాదేశ్ లో కురుస్తున్న అకాల వర్షం... టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరిన జట్ల తలరాతలను మారుస్తోంది. ఈ రోజు ఇండియా, సౌతాఫ్రికాల మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. బంగ్లాదేశ్ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వర్షం పడే అవకాశాలు 70శాతం వరకు ఉన్నాయి. నిబంధనల ప్రకారం... ఒక్కో జట్టు కనీసం ఐదు ఓవర్లు ఆడితేనే మ్యాచ్ ఫలితం తేలుతుంది. డక్ వర్త్ లూయీస్ నిబంధన అమలు చేయాలన్నా రెండో జట్టు కనీసం ఐదు ఓవర్లు ఆడాలి. లేకపోతే ఆట రద్దవుతుంది.

ఆట రద్దైతే... గ్రూప్ దశలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఇదే జరిగితే... గ్రూప్-2లో 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఇండియా ఫైనల్ చేరుతుంది. గ్రూప్-1లో 6 పాయింట్లతో రెండో స్థానం సాధించిన సఫారీ జట్టు ఇంటిముఖం పడుతుంది. సో... వర్షం పడితే దక్షిణాఫ్రికా మునిగినట్టే. దీనికితోడు... ప్రపంచకప్ లో సౌతాఫ్రికాకు సెమీఫైనల్స్ గండం ఉండనే ఉంది.

  • Loading...

More Telugu News