: విండీస్ కు క(వ)డగళ్లు... ఫైనల్ కు శ్రీలంక
టీ20 వరల్డ్ కప్ తొలి సెమీస్ లో హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్ కు వరుణుడు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇంకేముంది స్టేడియం అంతా వడగళ్ల వాన. ఆ తర్వాత మ్యాచ్ సాధ్యం కాలేదు. దీంతో 161 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన విండీస్ కు చివరకు కడగళ్లు మిగిలాయి. 13.5 ఓవర్లలో విండీస్ నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసినప్పుడు భారీ వర్షం కురిసింది. క్రీజులో మాంచి ఊపుమీదున్న శామ్యూల్స్, సామి ఉన్నారు. కానీ, ఆట సాధ్యం కాకపోవడంతో డక్ వర్త్ లూయీస్ పద్దతిలో 27 పరుగులతో శ్రీలంక గెలిచింది. విండీస్ బ్యాట్స్ మెన్ లలో డ్వేన్ బ్రావో 30 పరుగులు చేశాడు.