: బేగంపేట రుక్మిణి టవర్స్ లో భారీ అగ్నిప్రమాదం


హైదరాబాద్, బేగంపేట పైగా కాలనీ లోని రుక్మిణి టవర్స్ వాణిజ్య సముదాయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మూడు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు మొదటి అంతస్తు నుంచి నాల్గొవ అంతస్తుకు వ్యాపించాయి. కిటికీల అద్దాలను పగులగొట్టి పలు కుటుంబాలను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.

  • Loading...

More Telugu News