: టీడీపీ నేతల ఆరోగ్యం విషమం


గత నాలుగురోజులుగా విద్యుత్ సమస్యమీద నిరాహార దీక్ష చేస్తోన్న టీడీపీ ఎమ్మెల్యేల ఆరోగ్యం విషమంగా మారుతోంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దీక్ష చేస్తోన్న 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు సమీక్షించారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ అస్వస్థతకు గురయ్యారు. ఆమె గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు.

మొత్తంగా 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఈ పరిస్థితిలోనూ దీక్ష విరమణకు టీడీపీ నేతలు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.

ఇదిలాఉండగా, టీడీపీ అధినేత చంద్రబాబు నేతల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు దీక్ష శిబిరాన్ని సందర్శించి టీడీపీ నేతలను పరామర్శించారు. విద్యుత్ అంశంపై ప్రభుత్వం దిగిరాకుంటే మళ్లీ అసెంబ్లీ సమావేశాల నాటికి ఆందోళన తీవ్రరూపం దాలుస్తుందని రాఘవులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News