: జైరాం రమేష్ పై విరుచుకుపడ్డ కావూరి
కేంద్రమంత్రి జైరాం రమేష్ పై కావూరి సాంబశివరావు నిప్పులు చెరిగారు. కేవలం వ్యాపారాల కోసమే బీజేపీలో చేరారన్న జైరాం వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థిితికి జైరాం రమేషే కారణమని తెలిపారు. జైరాంలాంటి వారిని నమ్మరాదని చెప్పారు. సోనియాగాంధీ కోసం తాను పీవీ నరసింహారావుకు కూడా దూరమయ్యానని చెప్పారు.