: 3,500 ఏళ్ల నాటి వాతావరణశాఖ నివేదిక బయటపడింది!
వాతావరణ శాఖ రిపోర్టుల చరిత్ర ఈనాటిది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే, వాతావరణ శాఖ నివేదికల చరిత్ర 3,500 సంవత్సరాలకు పైమాటేనని తెలుస్తోంది. తాజాగా ప్రపంచపు అతి పురాతనమైన... 3,500 సంవత్సరాలకు సంబంధించిన వాతావరణ శాఖ నివేదిక ఈజిప్టులో బయటపడింది. టెంపెస్ట్ స్టెల్లా పేరుతో ఉన్న రాతప్రతి 40 లైన్లు, ఆరడుగుల పొడవు ఉన్నట్లు తెలిసింది.
మేఘావృతమై ఎడతెగని వర్షం కురిసే అవకాశం ఉందనే అర్థంతో రిపోర్టు ఉన్నట్టు షికాగో యూనివర్శిటీకి చెందిన ఇద్దరు పరిశోధకులు నాదైన్ మోల్లర్, రాబర్ట్ రింటర్ వెల్లడించారు. మధ్యధరా సముద్రంలోని సంత్రోరిని దీవుల్లో అగ్నిపర్వతం బద్ధలైపోవచ్చన్న వివరాలు కూడా ఇందులో ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ఇది ఈజిప్టు రాజు ఫారోస్ నాటి రిపోర్టు అని వారు తెలిపారు.