: రాయలసీమ పరిరక్షణ సమితి గుర్తు 'గ్యాస్ సిలిండర్'
రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) పార్టీ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులతో ఆర్పీఎస్ తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 1 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై హత్య కేసు నమోదు కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కూతురు డాక్టర్ శబరి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆ పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించింది.