: కృష్ణా, గోదావరి నదీజలాల బోర్డుల నియామకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్


కృష్ణా, గోదావరి నదీజలాల బోర్డుల నియామకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ పొడిగింపుతో పాటు, తుంగభద్ర బోర్డులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను చేరుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News