: వైఎస్ కుటుంబం వల్లే కరెంటు కష్టాలు
రాష్ట్రంలో విద్యుత్ సమస్య వైఎస్ కుటుంబ ఫలితమేనని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వైఎస్ కుటుంబానికి 22 విద్యుత్ ప్రాజక్టులున్నాయని ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. తన వారికి లబ్ది చేకూర్చే విధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎవరికైనా విద్యుత్ అమ్ముకునే వెసులుబాటు కల్పించారని తెలిపారు. దీని ఫలితమే ఇప్పుడు రాష్ట్రం విద్యుత్ సమస్యతో కొట్టుమిట్టాడుతుందని ఆయన విమర్శించారు.