: ఆప్ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు: బాబా రాందేవ్


ప్రజల మద్దతు, విశ్వాసాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కోల్పోయిందని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ అన్నారు. ఆప్ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. వారంతా బీజేపీలోకి రావడానికి ప్రయత్నాలు చేపట్టారని చెప్పారు. మోడీతో చేతులు కలపడానికి కేజ్రీవాల్ సిద్ధపడితే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అన్నారు. చండీఘడ్ లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి మోడీ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. వ్యవస్థను మార్చాలని వచ్చిన కేజ్రీవాల్ దారి తప్పారని... కాంగ్రెస్ చేతిలో కీలు బొమ్మలా మారారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News