: రైలు దోపిడీకి పాల్పడింది స్టువర్టుపురం దొంగలు


రెండు రోజుల క్రితం నడికుడి వద్ద చెన్నై ఎక్స్ ప్రెస్ రైలులో దోపిడీకి పాల్పడిన దొంగల గుట్టును పోలీసులు రట్టు చేశారు. చైన్నై ఎక్స్ ప్రెస్ రైలు దోపిడీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమగ్ర విచారణ చేసిన పోలీసులు దోపిడీ చేసింది స్టువర్టుపురం దొంగలుగా గుర్తించారు. ఓ మహిళా ప్రయాణికురాలి దగ్గర్నుంచి దోపిడీ చేసిన సెల్ ఫోన్ తో పిడుగురాళ్లలో పలువురితో మాట్లాడినట్టు గుర్తించారు. దోపిడీ దొంగల ముఠాలో ఓ మహిళ, ఐదుగురు పురుషులు ఉన్నారు. కాగా వీరంతా నిడుబ్రోలులో ప్రయాణికుల్లా రైలు ఎక్కినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News