: మల్కాజ్ గిరి నుంచి ఉండవల్లి పోటీ: హర్షకుమార్
మల్కాజ్ గిరి నుంచి ఉండవల్లి పోటీ చేస్తారని అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ తెలిపారు. అమలాపురంలో ఆయన మాట్లాడుతూ, గతంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో సీమాంధ్రులు ఉన్నందున ఉండవల్లిని అక్కడి నుంచి పోటీకి పెడుతున్నామని ఆయన తెలిపారు. దీనికి ఉండవల్లి కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.