: కోదండరామ్ తో సమావేశమైన ఓయూ జేఏసీ నేతలు
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తో ఉస్మానియా వర్శిటీ జేఏసీ నేతలు కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నుంచి పోటీ చేస్తున్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు టీజేఏసీ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నేతలు కోదండరామ్ ను కోరారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలన్న దానిపై స్టీరింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ తెలిపారు.