: సీపీఐ తెలంగాణ ఎన్నికల కమిటీ భేటీ


సీపీఐ తెలంగాణ ఎన్నికల కమిటీ సమావేశం హైదరాబాదులో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సంబంధించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రతిపాదించిన సీట్లకు అంగీకారం తెలపాలా? లేక తాము కోరుకున్న స్థానాలను కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచాలా? అన్న దానిపై నేతలు చర్చిస్తున్నారు. అలాగే సీపీఐ తెలంగాణ మేనిఫెస్టోను ఈరోజు మధ్యాహ్నం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News