: జేఎస్పీ తరపున అమలాపురం నుంచి పోటీ చేస్తా: హర్షకుమార్
వచ్చే ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున అమలాపురం నుంచే పోటీ చేయనున్నట్లు హర్షకుమార్ తెలిపారు. దాదాపు పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని చెప్పారు. తమ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని అనుకుంటున్నట్లు హర్షకుమార్ తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రానికి ప్రజలు గుణపాఠం చెబుతారని, విలువల ప్రాతిపదికనే రాజకీయాలు నడపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.