: అభం శుభం తెలియని ఆ చిన్నారులను చంపేశారు!


అనంతపురం జిల్లా మడకశిరలో దారుణం జరిగింది. పట్టణంలోని 14వ వార్డులో నివాసముంటున్న ఉపాధ్యాయులు సాకమ్మ, ఆనందప్ప దంపతుల కూతురు, కొడుకును ఈరోజు ఉదయం ఆగంతుకులు దారుణంగా హత్య చేశారు. ఉపాధ్యాయ దంపతులిద్దరూ విధులకు వెళ్లటంతో ఇంట్లో పిల్లలు మాత్రమే ఉన్నారు. వారు పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఇంట్లోకి చొరబడిన దుండగులు మంజువాణి (12), రంగనాథ్(8)ని టవల్ తో ఉరి బిగించి దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News