: హేమమాలినిపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ అభ్యర్థి హేమమాలినిపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఆమె నటించిన ఓ వాటర్ ఫిల్టర్ కంపెనీకి సంబంధించిన ప్రకటనను ఎన్నికల సమయంలో ప్రసారం చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే నిలిపివేయించాలంటూ ఈసీని కోరింది. ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ లీగల్, హ్యూమన్ రైట్స్ సెక్రటరీ కేసీ మిట్టల్ ఓ లేఖ రాశారు.