: వైఎస్ అవినీతి విదేశాల వరకూ వెళ్లింది: యనమల
వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతి విదేశాల వరకూ వెళ్లిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు యనమల మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ తన ఆత్మకు, తనయుడికి లక్షల కోట్లు దోచిపెట్టారన్నారు. ఆర్థిక నేరస్థులైన కేవీపీ, జగన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ఓట్ల కోసం దొంగనోట్లు పంచుతున్నారని ఆయన ఆరోపించారు.