: రైల్వే సిబ్బంది నిర్వాకం...రెండు రైళ్లు ఢీ
రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని సోనీభద్రకు 410 కిలోమీటర్ల దూరంలోని ఓబ్రాడ్యాం రైల్వేస్టేషన్ సమీపంలో వారణాసి-శక్తినగర్ ఇంటర్ సిటీ రైలు నిలిపి ఉంది. దీనిని గమనించకుండా రైల్వే సిబ్బంది కాత్ని ప్యాసింజర్ రైలుకు అదే లైనులో సిగ్నల్ ఇచ్చారు. దీంతో కాత్ని ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న వారణాసి-శక్తినగర్ రైలును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడగా, 12 మంది గాయాలపాలయ్యారు.