: నాకు ఇంతవరకు ఎలాంటి నోటీసు అందలేదు: కేవీపీ
టైటానియం మైనింగ్ కుంభకోణంలో షికాగో న్యాయస్థానం తనపై అభియోగాలు మోపడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ స్పందించారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరమని చెప్పారు. ఇప్పటిదాకా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. దర్యాప్తు సంస్థ తన నివేదికను బయటపెట్టాలని కోరారు. అమెరికా న్యాయ విభాగం, దర్యాప్తు సంస్థ నివేదిక అందాక మాట్లాడతానని చెప్పారు. వైఎస్ తన హృదయంలోనే ఉన్నారని... తాను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనని చెప్పారు.