: లెజెండ్ విజయ యాత్ర తరువాత పోటీ చేసే స్థానం ప్రకటిస్తా: బాలకృష్ణ


లెజెండ్ సినిమా విజయ యాత్ర తరువాత తాను పోటీ చేసే స్థానాన్ని ప్రకటిస్తానని సినీ నటుడు బాలకృష్ణ తెలిపారు. తిరుపతిలో లెజెండ్ విజయ యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లెజెండ్ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. లెజెండ్ విజయోత్సవ యాత్ర పూర్తి కాగానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో భేటీ అయిన తరువాత, తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని వెల్లడిస్తానని ఆయన అన్నారు. పైరసీని అడ్డుకోవాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News