: మీ తుపాకులను తిరిగిచ్చేయండి: పోలీసులు


ఎన్నికల కోడ్ సందర్భంగా తుపాకులను వెంటనే సరెండర్ చేయాలన్న పోలీసుల ఆదేశాలను ప్రముఖులు పట్టించుకోలేదు. గడువు ముగిసినా ఇంకా చాలా మంది తుపాకులను వారి వద్దే ఉంచుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీసులు 102 మందికి బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ గంగాధర్ మీడియాకు తెలిపారు. నోటీసులు అందుకున్న మూడు రోజుల్లో తుపాకులను అప్పజెప్పాలని, లేకుంటే వారి గన్ లైసెన్సులను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

సైబరాబాదు పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 2099 మందికి తుపాకీ లైసెన్స్ ఉందని జాయింట్ సీపీ చెప్పారు. వీరిలో 1535 మంది సరెండర్ చేయగా... 462 మందికి మినహాయింపు ఇచ్చామన్నారు. మినహాయింపు ఇచ్చిన వారిలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డులు, రైఫిల్ షూటింగ్ క్రీడాకారులు ఉన్నారన్నారు. ఇంకా 102 మంది ఇప్పటికీ తుపాకులను తిరిగివ్వలేదని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News