: ఒక్క సీటు ఎక్కువొచ్చినా దుకాణం మూసుకుంటారా?: టీడీపీకి హరీష్ సవాల్
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామనే ఆత్మ విశ్వాసాన్ని టీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యక్తం చేశారు. ఉపఎన్నికల్లో మాత్రమే గెలిచే పార్టీ అంటూ టీఆర్ఎస్ ను చంద్రబాబు ఎగతాళి చేస్తున్నారని... టీడీపీకంటే టీఆర్ఎస్ కు ఒక్క సీటు ఎక్కువొచ్చినా... తెలంగాణలో టీడీపీ దుకాణం మూసుకుంటారా? అని ప్రశ్నించారు. బీజేపీతో జతకట్టడం ఒక చారిత్రక తప్పిదం అని గతంలో మాట్లాడిన చంద్రబాబు... ఇప్పుడు మళ్లీ మోడీకి దగ్గరయ్యారని ఎద్దేవా చేశారు.