: నేడు కేంద్రమంత్రి పదవికి కావూరి రాజీనామా?
కేంద్రమంత్రి పదవికి కావూరి సాంబశివరావు ఈ రోజు రాజీనామా చేయనున్నారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరుకు నిరసనగా ఆయన తన మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ తో ఆయనకున్న 30 ఏళ్ల అనుబంధం తెగిపోనుంది. తొలిసారిగా 1984లో లోక్ సభకు ఆయన ఎన్నికైయ్యారు. ఆ తర్వాత 1989, 1998, 2004, 2009ల్లోనూ గెలుస్తూ వచ్చారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అనంతరం జూన్ 17,2013న కేంద్ర జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.