: మెరుగుపడుతున్న క్రికెటర్ జెస్సీ రైడర్ ఆరోగ్యం


తీవ్ర గాయాలపాలై కోమాలో ఉన్న ప్రముఖ న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్ ఆరోగ్యం మెరుగు పడుతుందని కివీస్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి హీత్ మిల్స్ వెల్లడించారు. చికిత్స అందిస్తున్న వైద్యుల నుంచి అతని ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని చెప్పారు.

కాగా జెస్సీ పై దాడి కేసులో 20 సంవత్సరాల యువకుడిని ఈరోజు న్యూజిలాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 4న కోర్టు ఎదుట అతన్ని హాజరుపరచనున్నట్లు చెప్పారు. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు నిన్న దాడి చేయడంతో జెస్సీ తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News