: వరంగల్ జిల్లా ప్రజలు టీడీపీని ఆదరిస్తారు: చంద్రబాబు
వరంగల్ జిల్లా ప్రజలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ఆదరిస్తారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండ ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమ్మక్క సారక్క జాతరను వైభవంగా నిర్వహించిన ఘనత తెలుగుదేశానిదే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జిల్లా అన్ని విధాలుగా నష్టపోయిందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా చేస్తామని తెలిపారు. జిల్లాకు చెందిన చాకలి ఐలమ్మ పోరాటం చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల వారే తెలంగాణ కోసం పోరాడారు తప్ప, కేసీఆర్ కుటుంబ సభ్యులు కాదని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తామని తెలిపారు. సామాజిక న్యాయం తెలుగుదేశంతోనే సాధ్యమన్న ఆయన, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు.