: టీఆర్ఎస్ తెలంగాణ అమరవీరులకు ఓడిపోయే స్థానాలను కేటాయిస్తోంది: ఎర్రబెల్లి


టీఆర్ఎస్ తెలంగాణ అమరవీరులకు ఓడిపోయే స్థానాలను కేటాయిస్తోందని తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. వరంగల్ జిల్లా హన్మకొండ ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి కృషి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలిపారు. అమరవీరుడు శ్రీకాంతాచారి కుటుంబానికి తెలుగుదేశమే సాయం చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News