: ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
తెలుగుదేశం పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆపార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ 9వరోజూ తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర సాగిస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబు పిఠాపురంలో ఈ వేడుకలు జరుపుకున్నారు.
అటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు చంద్రబాబుతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సంభాషించి శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు పార్టీ శ్రేణులు, ముఖ్యనేతలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవస్థాపకుడు.. ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి దివంగత నేతకు నివాళులు అర్పించారు. 2014 ఎన్నికల్లో మళ్లీ అధికారం చేజిక్కించుకుంటామని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి సీనియర్ నేతలు దీమా వ్యక్తం చేశారు.

- Loading...
More Telugu News
- Loading...