: పవన్ కల్యాణ్ మాటలు పట్టించుకోనక్కర్లేదు: మైసూరా
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కి నటించడం తప్ప, ఇంకేదయినా తెలుసా? అని ప్రశ్నించారు. పోనీ ఏ రోజైనా సమాజసేవ చేశారా? అని ఆయన అడిగారు. నీల్సన్ సర్వేల్లో వాస్తవాలు ఉన్నాయో లేదో అందరికీ తెలుసని, సీఎన్ఎన్ ఐబీఎన్ సర్వేలు ఏనాడైనా వాస్తవాలు అయ్యాయా? అని ఆయన అన్నారు. నీల్సన్ సర్వేలు ప్రజాభిప్రాయానికి దగ్గరగా ఉంటే వాటిపై టీడీపీ నేతలు బురదజల్లుతున్నారని ఆయన మండిపడ్డారు.