: కాంగ్రెస్ లో ప్రధాని పదవికి తగిన అభ్యర్థి లేరు: వెంకయ్య నాయుడు
కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవికి తగిన అభ్యర్థి లేడని, నరేంద్ర మోడీతో పోటీపడే నేత కాంగ్రెస్ లో కరవయ్యారని బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు అన్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. సమర్థుడైన నేత లేకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం లేదని వెంకయ్య విమర్శించారు.