: రాళ్లతో కొట్టుకున్న టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు


నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం జాడీ గ్రామంలో ప్రాదేశిక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. జాడీ గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతున్న సమయంలో సుదర్శన్ రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. దీంతో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు జోరుగా నినాదాలు చేశారు. ఒక దశలో పరిస్థితి చేయిదాటి రాళ్లు రువ్వుకున్నారు. దీంతో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News