: హన్మకొండలో ప్రారంభమైన ‘ప్రజాగర్జన’


వరంగల్ జిల్లాలోని హన్మకొండ హయగ్రీవాచారి స్టేడియంలో టీడీపీ నిర్వహిస్తున్న ‘ప్రజాగర్జన’ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సదస్సుకు అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. అవినీతి, కుట్ర రాజకీయాల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఈ సదస్సును ఏర్పాటు చేశారు.

‘ప్రజాగర్జన’ వేదికపై కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నారు. ఇదే వేదికపై టీడీపీ ఎన్నికల ప్రచారం కోసం రూపొందించిన పాటల సీడీ ‘తెలంగాణ ధూం తడాఖా’ను టీడీపీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News