: సోనియా గాంధీ ఆస్తులివి


సోనియా గాంధీ తన ఆస్తులను 9.28 కోట్ల రూపాయలుగా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆమె ఆస్తుల వివరాలు... మొత్తం చరాస్తుల విలువ 2.81 కోట్లు. కాగా, స్థిరాస్తుల విలువ 6.47 కోట్లు. తన కుమారుడు రాహుల్ గాంధీకి అప్పుగా 9 లక్షల రూపాయలు ఇచ్చారు. చరాస్తుల్లో 85 వేల రూపాయల నగదు ఉండగా, 66 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో ఉన్నాయి. 10 లక్షల రూపాయల విలువైన బాండ్లు, 1.90 లక్షల రూపాయల విలువైన షేర్లు ఆమె పేరిట ఉన్నాయి. 2012-13 సంవత్సరానికి గాను ఆమె 14.21 లక్షల ఆదాయపు పన్ను చెల్లించారు.

మ్యూచువల్ ఫండ్స్ లో 82.20 లక్షలు, ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)లో 42.49 లక్షలు, జాతీయ పొదుపు పథకంలో 2.86 లక్షలు ఉన్నాయి. కాగా సోనియా వద్ద ఉన్న ఆభరణాల విలువ 62 లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. ఇటలీలో తనకున్న ఒక స్థలం విలువ 19.90 లక్షలు కాగా, మరొక స్థలం విలువ 4.86 లక్షలుగా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో ఆమెకు 1.40 లక్షల రూపాయల విలువ చేసే స్థలం వుంది. ఇవన్నీ కలిపి 9.28 కోట్ల రూపాయలని ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News