: తెలంగాణలో 90 సీట్లకు అభ్యర్థులు ఖరారు: దిగ్విజయ్
తెలంగాణలో 90 సీట్లకు అభ్యర్థుల జాబితా ఖరారైనట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ తో పొత్తు అంశంపై తననెవరూ సంప్రదించలేదని అన్నారు. సీమాంధ్ర అభ్యర్థుల ఎంపికపై గురువారం నాడు స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతుందని దిగ్విజయ్ తెలిపారు.