: రాహుల్ గురించి నేనలా అనలేదు: వరుణ్ గాంధీ


తన పెదనాన్న కుమారుడు రాహుల్ గాంధీ అమేథీలో చేసిన కృషిని ప్రశంసించిన బీజేపీ నాయకుడు వరుణ్ గాంధీ ఇరకాటంలో పడ్డారు. తన వ్యాఖ్యలు ఏ రాజకీయ పార్టీని కాని, అభ్యర్థిని కాని సమర్థించినట్లు కాదని వరుణ్ వివరణ ఇచ్చుకున్నారు. ‘‘నేను చేసిన వ్యాఖ్యలు ఏ రాజకీయ పార్టీనో, అభ్యర్థినో సమర్థించినట్లు కాదు’’ అని ఆయన తాజాగా ట్వీట్ చేశారు. అమేథీలో మహిళల సాధికారత కోసం స్వయం సంఘాలు సాగించిన కృషిని ప్రశంసించి వరుణ్ గాంధీ రాహుల్ పై పొగడ్తల వర్షం కురిపించి ఇబ్బందికర పరిస్థితిని కొనితెచ్చుకున్నాడు.

  • Loading...

More Telugu News