: ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లలో కాంగ్రెస్ ను వీడిన ఎమ్మెల్యేలు 73 మంది
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో 73 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పతనమవుతూ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి ఛరిష్మాతో 2009 ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 33 మంది వైఎస్సార్సీపీలో చేరగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో 27 మంది టీడీపీని ఆశ్రయించారు. తెలంగాణలో ఉద్యమం నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు.
స్థానిక ఎన్నికల తరువాత మరికొంత మంది పార్టీని వీడే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.