: గ్రేటర్ లో పాగా కోసం కేసీఆర్ కసరత్తు


లోక్ సభకు ముందస్తు ఎన్నిక(ల)లు వస్తాయని భావిస్తోన్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆ దిశగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసే పనిలో పడ్డారు.  తెలంగాణ వాదం ప్రబలంగా లేదని భావిస్తోన్న హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల మీదే కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా తొలుత గ్రేటర్ హైదరాబాద్ లో ఎలా పాగా వేయాలనే దానిపై  కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నారు. 

నిన్న తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఇన్ చార్జ్ లతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేశారు. ఏప్రిల్ 2నుంచి రెండు విడతలుగా బస్తీ బాట కార్యక్రమం నిర్వర్తించాలని ఆదేశించారు. తొలివిడతగా ఏప్రిల్ 2నుంచి 9వరకూ, రెండో విడతగా ఏప్రిల్ 12నుంచి 19 వరకూ బస్తీబాట షెడ్యూల్ ఖరారు చేశారు.

ఎంఐఎం పార్టీ బలంగా ఉన్న హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గాన్ని పక్కన పెట్టేసి, బలహీనంగా ఉన్న సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల స్థానాల్లో పట్టుబిగించాలంటూ కేసీఆర్ నిన్న పార్టీ శ్రేణులకు మార్గనిర్ధేశం చేశారు. బస్తీబాట ముగిశాక, జిల్లాల్లో ఎన్నికల కోణంలో కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.   

  • Loading...

More Telugu News