: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడిక ఒంటరే!


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు విడాకులు మంజూరైనట్లు క్రెమ్లిన్ ధృవీకరించింది. విభేదాలు తలెత్తడంతో పుతిన్, ఆయన భార్య ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినాలు గత వేసవిలో విడిపోయారు. మూడు దశాబ్దాల వైవాహిక జీవితానికి తెరదించుతున్నామని గతేడాది జూన్ లో పుతిన్ దంపతులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

కనీసం ఒకరినొకరు చూసుకోలేకపోతున్నామని, ఇలా అయితే వైవాహిక జీవితానికి అర్థం లేదని పుతినా చెప్పినట్టు పుతిన్ వెల్లడించారు. దాంతో ఇద్దరం చట్టబద్ధంగా విడిపోవాలని నిర్ణయించుకున్నామని పుతిన్ ఓ ప్రకటనలో తెలిపారు. అప్పటి నుంచి పబ్లిక్ లైఫ్ కు పుతినా దూరంగా ఉంటున్నారు. పుతిన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఇక, తాను దేశ ప్రథమ పౌరురాలు కాదని పుతినా ప్రకటించింది. పుతినా, పుతిన్ లకు విడాకులు మంజూరైనట్లు అధ్యక్ష భవన అధికార ప్రతినిధి మిత్రి పెస్కోప్ టాస్ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.

  • Loading...

More Telugu News