: టీమిండియా టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్
టీమిండియా టీ20ల్లో మరో ఘనతను సొంతం చేసుకుంది. టీ20 ప్రపంచకప్ లో తిరుగులేని జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్ లో శ్రీలంకను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. భారత్, శ్రీలంక జట్లు 130 పాయింట్లతో సమ ఉజ్జీలుగా నిలువగా, వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు అగ్రస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ప్రపంచకప్ లో టీమిండియా ఇప్పటి వరకు ఓటమిపాలు కాకుండా సెమీఫైనల్ లో అడుగుపెట్టింది.