: 70 ఏళ్ల తరువాత పేలిన బాంబు...6 గురి మృతి, 18కి గాయాలు
70 ఏళ్ల క్రితం (రెండో ప్రపంచ యుద్ధం) నాటి బాంబు పేలి ఆరుగురు మృతి చెందారు. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఒక ఇంటిని నిర్మిస్తుండగా, రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి పేలకుండా ఉన్న బాంబు దొరికింది. ఆ స్థలం యజమాని దీన్ని పాత సామాన్ల వ్యాపారికి అమ్మేశాడు. ఆ వ్యాపారి దానిని తన గోడౌన్ లోకి తీసుకెళ్లి, బాంబును తెరిచేందుకు యత్నించాడు. బాంబును తెరిచేందుకు గ్యాస్ కట్టర్ ఉపయోగించాడు.
గ్యాస్ కట్టర్ వేడికి బాంబు అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ బాంబు పేలుడుకు తీవ్ర నష్టం సంభవించింది. చుట్టుపక్కల ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. బాంబు రెండో ప్రపంచ యుద్ధం నాటిదని, ఇన్నాళ్ల తరువాత పేలుతుందని అనుకోలేదని తుక్కుషాపు యజమాని తెలిపాడు.