: భక్తి పూర్వకంగా గుడ్ ఫ్రైడే
ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజును క్రైస్తవులు గుడ్ ఫ్రైడే (పవిత్రదినం)గా జరుపుకుంటారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను భక్తి పూర్వకంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లో భారీ ర్యాలీ జరిగింది. సికింద్రాబాద్ కెజిఆర్ గార్డెన్స్ నుంచి ప్యాట్నీ వరకు జరిగిన ర్యాలీలో క్రైస్తవులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఏసు ప్రభువు కరుణ, త్యాగనిరతిని కొనియాడారు.
విశాఖలో రక్షణ గిరి కొండపై ఉన్న చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బిషప్ ప్రకాశ్ తో పాటు భక్తులు పాదయాత్ర నిర్వహించారు. నెల్లూరులోని సెయింట్ జోసఫ్ చర్చిలోనూ క్రైస్తవులు ప్రార్థనలు జరిపారు.