: తగ్గిన నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర
అంతర్జాతీయ మార్కెట్ లో గ్యాస్ ధర తగ్గడంతో నాన్ సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాదులో నాన్ సబ్సిడీ సిలిండర్ పై రూ. 106, వాణిజ్య సిలిండర్ పై రూ. 166 తగ్గింది. తగ్గిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 14.2 కిలోల నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇంతకు మునుపు రూ. 1,168 ఉండగా, ఇప్పుడది రూ. 1,062 తగ్గింది. ఇక, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇంతకు మునుపు రూ. 1,996 ఉండగా, తాజా తగ్గింపుతో రూ. 1,830 లకు లభిస్తోంది.