: వారణాసిలో మోడీని ఓడిస్తా: కేజ్రీవాల్
వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఓడిస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. తాను బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తూర్పు ఢిల్లీలో ఏఏపీ అభ్యర్థి రాజ్ మోహన్ గాంధీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తూర్పారపట్టారు.
ఒక వేళ పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశం మాత్రమే ఉంటే సులభంగా గెలిచే సీటును ఎంచుకుని పోటీ చేసేవాడినని కేజ్రీవాల్ చెప్పారు. కేవలం మోడీని ఓడించాలనే వారణాసి నుంచి పోటీ చేస్తున్నానని ఆయన అన్నారు. అలాగే రాహుల్ గాంధీని ఓడించడానికి అమేథీలో కుమార్ విశ్వాస్ ను బరిలోకి దించామని ఆయన అన్నారు.