: టీడీపీ, బీజేపీలు బీసీలను మభ్యపెడుతున్నాయి: రాఘవులు
ఓట్ల కోసం టీడీపీ, బీజేపీలు బీసీలను మభ్యపెడుతున్నాయని సీీపీఎం నేత రాఘవులు విమర్శించారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటూ టీడీపీ, బీసీ నేత మోడీని ప్రధానిని చేస్తామంటూ బీజేపీలు బీసీలను బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.