: అన్నా... నువ్వు సూపర్: రాహుల్ కు సోదరుడు వరుణ్ కితాబు


వారిద్దరూ దాయాది సోదరులే, అయినా ఒకరంటే ఒకరికి గిట్టదు. పైగా రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ ఇద్దరూ పరస్పర భిన్నమైన కాంగ్రెస్, బీజేపీలకు చెందినవారు. అలాంటి ఈ బద్ధ విరోధ సోదరుల మధ్య ఒక అపురూపమైన సన్నివేశం చోటు చేసుకుంది. తన పెద్దమ్మ సోనియాగాంధీ, తన పెదనాన్న కుమారుడు రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడని మేనకా గాంధీ (సంజయ్ గాంధీ భార్య) కుమారుడు వరుణ్ గాంధీ మొదటిసారి పెదవి విప్పాడు. అంతేకాదు, రాహుల్ ను కీర్తిస్తూ... అమేథీలో మహిళల సాధికారత కోసం రాహుల్ చేస్తున్న కృషి అద్భుతమని ప్రశంసలతో ముంచెత్తాడు. దీనికి రాహుల్ నుంచి కూడా సానుకూల స్పందన లభించింది. తన సోదరుడు తన పనితీరును మెచ్చుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని రాహుల్ చెప్పాడు.

  • Loading...

More Telugu News