: నాకు కోపం తెప్పించవద్దు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీపై పని గట్టుకుని మరీ ఒకటి రెండు టీవీ ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. జగన్ ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడుపోండి కానీ, తనపై దుష్ప్రచారం చేయవద్దని ఆయన హెచ్చరించారు. మున్ముందు ఇలానే కొనసాగితే తనకు కోపం వస్తుందని చంద్రబాబు చెప్పారు.