: టాప్ టెన్ లో మిథాలీ రాజ్, పూనమ్ రౌత్, హర్మన్ ప్రీత్
భారత మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ టీ20 ర్యాంకింగ్స్ లో ఐదవ స్థానంలో నిలిచింది. భారత్ తరపున ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం గమనార్హం. భారత్ బ్యాట్స్ విమెన్ పూనమ్ రౌత్, హర్మన్ ప్రీత్ కౌర్ టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్నారు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో 646 పాయింట్లతో మిథాలీ 5వ స్థానంలో నిలిచింది.
పూనమ్ 8వ ర్యాంకును దక్కించుకుంది. హర్మన్ ప్రీత్ రెండు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకు సంపాదించుకుంది. ఏ ఇతర జట్టు నుంచి కూడా ముగ్గురు క్రీడాకారిణులు టాప్ టాన్ లో లేకపోవడం గమనార్హం. బౌలింగ్ విభాగంలో భారత్ తరపున జులన్ గోస్వామి ఒక్కరే టాప్ 20లో నిలిచారు. ఆమె 17వ ర్యాంక్ దక్కించుకుంది. తొలిసారిగా ప్రవేశపెట్టిన ఆల్ రౌండర్ లిస్టులో శ్రీలంక కెప్టెన్ సిరివర్థనే అగ్రస్థానంలో నిలిచింది.