: చంద్రబాబుది ముందొక మాట, వెనుకొకమాట: దిగ్విజయ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తుతో చంద్రబాబు లౌకికవాదానికి తిలోదకాలిచ్చారని డిగ్గీరాజా విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో తొలుత తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, ఆనక విభజనకు వ్యతిరేకమని చెప్తూ ఇరు ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.