: దూరదృష్టి గల నాయకుడు చంద్రబాబు: మండలి
ప్రస్తుతం సీమాంధ్రకు సమర్థుడైన నాయకుడు అవసరమని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం తనకుందని తెలిపారు. చంద్రబాబు దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తనకు పదవులు వస్తాయని... అయినా రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి టీడీపీలో చేరానని చెప్పారు. ఈ రోజు టీడీపీలో చేరిన సందర్భంగా మండలి ఈ వ్యాఖ్యలు చేశారు.