: ఆ రెండు అసెంబ్లీ స్థానాలు సీపీఐకి ఇవ్వడానికి ఒప్పుకోం: బలరాం నాయక్
సీపీఐతో పొత్తులో భాగంగా మహబూబాబాద్, పినపాక అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీకి కేటాయించేందుకు ఒప్పుకోమని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం నాయక్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అధిష్ఠానానికి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశామని తెలిపారు.